గుంటూరు కన్యకాపరమేశ్వరి ఆలయాన్ని సందర్శించిన పవన్ కల్యాణ్

  • గుంటూరులో పవన్ పర్యటన
  • వాసవీ అమ్మవారి ఆలయం వద్ద కోలాహలం
  • ప్రత్యేక పూజలు చేసిన పవన్
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నేడు గుంటూరు విచ్చేశారు. ఈ మధ్యాహ్నం ఆయన ఇక్కడి వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని సందర్శించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. పవన్ కు ఆలయ వర్గాలు సంప్రదాయ స్వాగతం పలికాయి. పవన్ వస్తున్నారని తెలియడంతో అభిమానులు, జనసైనికులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. దీంతో కన్యకా పరమేశ్వరి ఆలయ పరిసరాల్లో కోలాహలం నెలకొంది. అందరికీ అభివాదం చేస్తూ పవన్ కల్యాణ్ ఆలయంలోకి ప్రవేశించారు. వాసవీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు జనసేనానికి తీర్థప్రసాదాలు, పవిత్ర వస్త్రం అందజేశారు.

Pawan Kalyan
Kanyaka Parameswari Temple
Guntur
Janasena

More Telugu News